- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ చిత్రం ప్రీమియర్ షోలకు గురువారం తెలంగాణ ప్రభుత్వం నుంచి జీవో రాకపోవడంతో, కేవలం మీడియా కోసం బాలానగర్‌లోని విమల్ థియేటర్‌లో షో వేయాలని నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే మూవీ చూసేందుకు అభిమానులు థియేటర్‌లోకి వెళ్లడంతో అందరినీ బయటకు పంపించారు. దీంతో ‘వి వాంట్ జస్టిస్’ అంటూ అభిమానులు ఆందోళనకు దిగారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
- Advertisement -



