- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: యూట్యూబర్ అన్వేష్‌కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. విదేశాల్లోని అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. అన్వేష్ యూజర్ ఐడీ వివరాలు కావాలని పంజాగుట్ట పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌కు లెటర్ రాశారు. అన్వేష్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాగా హిందూ దేవతలను కించపరిచారని బీజేపీ నేత కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. అతడిపై హిందూసంఘాలు మండిపడుతున్నాయి.
- Advertisement -



