Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భరోసా కోసమే పోలీస్ ఓపెన్ హౌస్: ఎస్ఐ 

భరోసా కోసమే పోలీస్ ఓపెన్ హౌస్: ఎస్ఐ 

- Advertisement -

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
పోలీస్ శాఖ‌పై భ‌రోసా క‌ల్పించేందుకే ఓపెన్ హౌస్ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నామ‌ని నసురుల్లాబాద్ ఎస్ఐ రాఘవేంద్ర తెలిపారు. గురువారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ ఆవరణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 21 నుండి వ 31 వరకు నిర్వహిస్తున్న పోలీస్ ఫ్లాగ్ డే లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విద్యార్థులకు పోలీసు వ్యవస్థ ద్వారా బాలికలు,మహిళలు రక్షణకై పోక్సో చట్టం, భరోసా కేంద్రం పనితీరు, షీ టీం లు అందిస్తున్న సేవలను విద్యార్థులకు వివరించారు. పోలీసు వ్యవస్థ భయాన్ని పొగొట్టి తమ రక్షణ‌కే అనే నమ్మకాన్ని ప్రజలకు నమ్మకం కల్పించడంమే ముఖ్యఉద్దేశ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -