Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుగౌతమ్ నగర్ లో పోలీసుల పెట్రోలింగ్..

గౌతమ్ నగర్ లో పోలీసుల పెట్రోలింగ్..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు అడిషనల్ డిసిపి బస్వరెడ్డి, పర్యవేక్షణలో నిజామాబాద్ ఏసిపి రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గౌతమ్ నగర్ ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. దాదాపు 100 మంది పోలీసులు పది టీములుగా విడిపోయి పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రజలలో అభద్రతాభావం తొలగించడానికి దొంగతనాల నివారణ, మాదకద్రవ్యాల, నేరాల నివారణ మొదలగు కార్యక్రమాలలో భాగంగా గిరిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏరియా గౌతమ్ నగర్ డివిజన్లో ప్రతి గల్లీలో పెట్రోలింగ్ సోదాలు నిర్వహించి అనుమానితులను రౌడీషీట్లను చెక్ చేశారు. అలాగే సరియైన పత్రాలు లేని నంబర్లు లేని దాదాపు 60 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని వెరిఫై చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఏసిపి మాట్లాడుతూ.. ప్రజలందరూ యూనిఫామ్ లేని పోలీసులని, చట్టాన్ని అందరూ గౌరవించాలని, అనుమానితులు గురించి, అసాంఘిక కార్యకలాపాల గురించి సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. అందరూ ఒక కమిటీగా ఏర్పడి ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. దీనివల్ల చాలా నేరాలు నివారించవచ్చును అని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజల భద్రత కోసం ఉద్దేశించిందని తెలిపారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. వారి సూచనలు సలహాలు కూడా స్వీకరించడం జరిగిందన్నారు. ఈ ప్రోగ్రాం లో గౌతమ్ నగర్ డివిజన్ ప్రజలు సహకరించారన్నారు. ఈ కార్యక్రమంలో  నగర సిఐ శ్రీనివాస్ రాజ్, త్రీ టౌన్ ఎస్సై హరిబాబు, నిజామాబాద్ డివిజన్లోని పలువురు సిఐలు రఘుపతి, సురేష్, మల్లేష్, భిక్షపతి, శ్రీలత ఎస్ఐలు ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad