నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ గవర్నర్ అధికారిక నివాసంలో బీజేపీకి చెందిన నేరస్తులు ఆశ్రయం పొందుతున్నారని, లోపల ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నిల్వ చేశారని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ సీవీ ఆనంద బోస్ భద్రతా దళాలతో రాజ్‌భవన్‌ను తనిఖీ చేయించారు. సోమవారం ఉత్తర జిల్లా పర్యటనను మధ్యలోనే ఆయన ముగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు, కేంద్ర భద్రతా దళాలతో కలిసి రాజ్‌భవన్ లోపల సోదా చేయించారు.
మరోవైపు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై గవర్నర్ కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే గవర్నర్ ఉత్తర్వులను పాటించకపోతే చర్యలు తీసుకుంటామని పోలీసులకు కూడా సీవీ ఆనంద బోస్ కార్యాలయం వార్నింగ్ ఇచ్చింది.



