Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుడుంబా స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు

గుడుంబా స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు

- Advertisement -

600 లీటర్ల పానకం ధ్వంసం.. 20 లీటర్ల నాటుసారాయి స్వాధీనం
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని కొండంపేట, కొయ్యుర్ గ్రామాల్లో రహస్యమైన ప్రాంతాల్లో గుడుంబా తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు బుధవారం కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్ ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాలపై  పోలీసులు విస్తృతంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 600 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, 20 లీటర్ల నాటుసారాయిని స్వాధీనం చేసుకొన్నారు. గుడుంబా తయారు చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడారు ప్రభుత్వ నిషేధిత గుడుంబా, గజాయ్, ఇతర మత్తు పదార్దాలు విక్రయించిన, తయారు చేసిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -