Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు.!

పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు.!

- Advertisement -

ఆరు సెల్ ఫోన్స్, మూడు బైక్స్, రూ.29 వేలు స్వాధీనం
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్లలో పలు ప్రాంతాల్లో చట్ట వ్యతిరేకమైన పేకాట అడుతున్నారనే సమాచారం మేరకు కొయ్యుర్ ఎస్సై నరేష్,ఎస్సై-2 రాజన్ తన సిబ్బందితో కలిసి సోమవారం పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి రూ.29,300,మూడు బైక్స్, ఆరు సెల్ ఫాన్స్ లను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ మాట్లాడారు. ఎవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -