- Advertisement -
నిజాయితీకి మిర్చి సన్మానించిన ఎస్సై
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని ఇసన్నపల్లి(రామారెడ్డి) లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయానికి బాన్సువాడకు చెందన సాయి సురేఖ దర్శనానికి శుక్రవారం వచ్చారు. రూ. 20వేల తో ఉన్న పరుచును పోగొట్టుకున్నారు. గ్రామానికి చెందిన కందూరి పెద్ద లక్ష్మికి దొరకడంతో, సంబంధిత పోలీస్ స్టేషన్లో పరుసును ఎస్సై రాజశేఖర్ కు అందజేశారు. రాజశేఖర్ విచారించి పరుసును రూ .20000 అందజేశారు. పెద్ద లక్ష్మీ నిజాయితీని మెచ్చుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో శాలువాతో సన్మానించారు.
- Advertisement -


