Friday, September 12, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జింకను కాపాడిన పోలీసులు..

జింకను కాపాడిన పోలీసులు..

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని బ్రహ్మంన్ గావ్  గ్రామ శివారులో బుధవారం జింక పై కుక్కలు దాడి చేశాయి. దీంతో స్థానికులు డయల్ 100 పోన్ చేయటంతో ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ ఆధ్వర్యంలో పోలిస్ నారీ శక్తి టీం తేజశ్రీ,విజేత,లు సంఘటన వేళ్ళి జింక ను కాపాడారు. ఆనంతరం అటవీ శాఖ అధికారులకు  సమాచారం అందించారు. గాయపడిన జింకను అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానిక పోలిస్ స్టేషన్ లో  అటవీశాఖ బీట్ ఆఫీసర్ శంకర్ కు పోలిసులకు జింకను అందించారు. గాయపడిన జింక కు  పశు వైద్యాధికారి రవింధర్ చికిత్స అందించారు.ఈ కార్యక్రమంలో  ఎఎస్ఐ యశ్వంత్ రావ్, హేడ్ కానిస్టేబుల్ లు  సుభాష్, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -