Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు..

యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు..

- Advertisement -

జిల్లా ఎస్పీ మహేష్ బిగితే
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

జిల్లాలో యూరియా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లో సిబ్బంది  24/7 నిరంతరం పగడ్బందీగా అప్రమత్తంగా ఉంటూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహిస్తూ యూరియా అక్రమ రవాణా చేసేవారిని పట్టుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పటిష్ట  పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యూరియా ఎరువులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు.ఎరువుల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా రవాణా చేస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుంది హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad