Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సామాజిక సేవలో పోలీసులు ముందుండాలి

సామాజిక సేవలో పోలీసులు ముందుండాలి

- Advertisement -

రక్తదాన శిబిరం లో డీఎస్పీ రాజశేఖర్ రాజు 
నవతెలంగాణ- మిర్యాలగూడ 

సామాజిక సేవలో పోలీసులు ముందుండాలని డీఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల సేవలను మారవలేదన్నారు. నిత్యం ప్రజా సేవలో ఉండి ప్రాణాలు కోల్పోయిన పోలీసులు కుటుంబాలను ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రజల తో ఫ్రెండ్లీగా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నారు. పోలీసులు బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. రక్తదానం చేసిన యువకులను, పోలీసులను అభినందించారు. అనంతరం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సి ఐ లు నాగభూషణం, సోమ నరసయ్య, పి ఎన్ డి ప్రసాద్, ఎస్ ఐ లు సైదిరెడ్డి, రాంబాబు, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, లక్ష్మయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -