Sunday, February 15, 2026
E-PAPER
Homeఖమ్మంసామాజిక బాధ్యత చాటుకున్న పోలీస్

సామాజిక బాధ్యత చాటుకున్న పోలీస్

- Advertisement -

– ప్రమాదాలు నివారించేందుకు చర్యలు 
– రోడ్డు కు ఇరువైపులా పొదలు తొలగింపు
– కానిస్టేబుల్ కునుసోతు వెంకన్న ఉదారత
నవతెలంగాణ – అశ్వారావుపేట 

ఉద్యోగి గా విధులు నిర్వర్తించడం వేరు.. పౌరుడిగా సామాజిక బాధ్యతగా ఓ కార్యం తలపెట్టడం వేరు. ఏదో రకంగా సమాజానికి తనవంతు సహకారం అందించాలనే తలంపుతో ఉండేవారు అరుదు. అలాంటి వ్యక్తే అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్హహించే కానిస్టేబుల్ కునుసోతు వెంకన్న.

అశ్వారావుపేట – మందలపల్లి స్టేట్ హైవే కి ఇరువైపులా పొదలు ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది గమనించిన ఆయన గుబురు పొదలు తొలగించి ప్రమాదాలకు అట్టు కట్ట వేయాలనుకున్నాడు. ఆదివారం తన సొంత ఖర్చులతో జేసీబీ తో రోడ్డు కు ఇరువైపులా దట్టంగా ముసురుకున్న గుబురు పొదలను తొలగించాడు.

ఈ సందర్భంగా ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ దమ్మపేట నుంచి అశ్వారావుపేట వెళ్లే రోడ్ మార్గంలో అచ్యుతాపురం స్టేజ్ గుట్ట మలుపు వద్ద రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి అని,మెయిన్ రోడ్డు కి ఇరువైపుల పిచ్చి రొట్ట పేరుకు పోయి రోడ్డు కనపడక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు అని ఆవేదన చెందారు.దమ్మపేట మండలం నాగుపల్లి కి చెందిన కునసోతు వెంకన్న అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.ప్రమాదకరంగా ఉన్న పిచ్చి రొట్ట ని తన సొంత ఖర్చులతో జేసీ బీ పెట్టించి తొలిగించినట్ధు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -