– తాజాగా మరో అధికారి సూసైడ్
– డీజీపీని సెలవుపై పంపిన హర్యానా ప్రభుత్వం
– రద్దయిన ప్రధాని ర్యాలీ
చండీఘర్ : సీనియర్ ఐపీఎస్ అధికారి వై.పూరన్ కుమార్ ఆత్మహత్య ఉదంతంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హర్యానాలో మరో అధికారి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడంతో చర్చనీ యాంశంగా మమారింది. పూరన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆ అధికారి తన సూసైడ్ నోట్‌లో ఆరోపణలు చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఏఎస్సై సందీప్‌కుమార్ రోV్‌ాతక్ సైబర్ సెల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. పూరన్ కుమార్‌పై ఉన్న ఓ అవినీతి కేసును ఆయన దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పూరన్ కుమార్‌పై తన సూసైడ్ నోట్‌లో ఆరోపణలు చేశారు. నిజాలు వెలుగులోకి రావ డం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నట్టు రాశారు.
సెలవుపై డీజీపీ..
బీజేపీ ప్రభుత్వం సోమవారం రాత్రి రాష్ట్ర డీజీపీ శత్రుజిత్ కపూర్‌ను సెలవుపై పంపింది. కపూర్ సెలవు కాలంలో 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి ప్రకాష్ సింగ్‌కు డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆత్మహత్య చేసుకున్న పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం పరామర్శించారు. రాహుల్ రాక నేపథ్యం లో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించి డీజీపీని సెలవుపై పంపింది. ఇదిలావుండగా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సోనిపట్‌లో ఈ నెల 17న పార్టీ భారీ ర్యాలీ తలపెట్టింది. ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించాల్సి ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆ ర్యాలీని రద్దు చేశారు.
ర్యాలీ కోసం పెద్దఎత్తున సన్నాహాలు జరుగుతున్న తరుణంలో పూరన్ కుమార్ ఆత్మహత్య ఉదంతం రాష్ట్రంలో కలకలం రేపింది. ర్యాలీ నిర్వహణపై ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ అనేక సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అయితే అధికారి ఆత్మహత్య తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రధాని పర్యటనకు అనువుగా లేవని బీజేపీ భావించింది. కుల వివక్ష, సీనియర్ అధికారుల వేధింపుల కారణంగా ఈ నెల 7న పూరన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటన జరిగి వారం రోజులు గడిచినప్పటికీ కపూర్‌కు శవపరీక్ష నిర్వహించి, అంత్యక్రియలు జరిపే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. పూరన్ ఆత్మహత్యకు కారణమైన డీజీపీని, రోV్‌ాతక్ ఎస్పీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. డీజీపీని సెలవుపై పంపిన నేపథ్యంలో శవపరీక్షకు పూరన్ కుటుంబ సభ్యులను ఒప్పించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇదిలావుండగా బీహార్‌లో బీజేపీ భాగస్వామ్య పక్షమైన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ బాధిత కుటుంబానికి బహిరంగంగా మద్దతు తెలిపారు. ఎన్డీఏకు చెందిన మరో సభ్యుడు, కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) అధ్యక్షుడు రాందాస్ అథావలే చండీఘర్‌లో పూరన్ కుటుంబ సభ్యులను కలిశారు. ఆత్మహత్యకు కారకులైన అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఆయన కలిశారు.
హర్యానాలో ఆగని పోలీసుల ఆత్మహత్యలు
- Advertisement -
- Advertisement -