Thursday, February 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న కార్యక్రమం

ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు 
ఆత్మకూరు మండల పరిధిలో రోడ్డు ప్రమాదాలు, వాహన దొంగతనాలను నివారించడానికి ఆత్మకూరు పోలీసులు వినూత్న చర్యకు పూనుకున్నారు. గురువారం సాయంత్రం నీరు కుళ్ళు క్రాస్ రోడ్ వద్ద పోలీస్ వాహనాల కటౌట్‌లు ఏర్పాటు చేశారు. స్థానిక సీఐ ఆర్ సంతోష్ మీడియాకు అందించిన సమాచారం ప్రకారం.. “ఈ ప్రాంతంలో తరచూ జరుగుతున్న ప్రమాదాలు, దొంగతనాలను అరికట్టడానికి ఈ కటౌట్‌లు హెచ్చరికగా పనిచేస్తాయి. వాహనదారులు జాగ్రత్తగా తిరిగితే ఎలాంటి సమస్యలు ఉండవని” పోలీసులు తెలిపారు. స్థానికులు ఈ చర్యను స్వాగతిస్తూ.. మరిన్ని చోట్ల ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయాలని కోరారు. పోలీసులు మండల ఇతర ప్రమాదాయిత ప్రాంతాల్లో కూడా ఇలాంటి చర్యలు తీసుకోనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -