– నిందితులను వెంటనే రిమాండ్ చేయాలి: ప్రజా సంఘాల డిమాండ్
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
ప్రియాంక మృతి పై పోలీసులు నిర్లక్ష్య వైఖరి విడనాడి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ప్రజా సంఘాల నాయకులు బుధవారం అంబేద్కర్ చౌరస్తా లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల, పార్టీల ప్రతినిధులు మాట్లాడారు. గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామంలో ఖమ్మం జిల్లా కు చెందిన ప్రియాంక మరణం పైన అనేక అనుమానాలు ఉన్నయని వాటి పై దర్యాప్తు జరిపి నిందితులు ను వెంటనే రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. కోలేటి ప్రియాంక చనిపోయి నెల రోజులవుతున్న నిందితులని ఇంకా అరెస్ట్ చెయ్యకపోవడం చాలా అన్యాయం అన్నారు. ప్రియాంక మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి నిందుతులను జైలుకు పంపి ప్రియాంక తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ,పోలీస్ లు మొండి వైఖరి వీడి నిందుతులను వెంటనే అరెస్టు చేయాలి, ఒకవేళ అరెస్ట్ చెయ్యకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారాకోలు, చెప్పడతామని హెచ్చరించారు.
ప్రియాంక మరణంపై పోలీసుల నిర్లక్ష్య వైఖరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



