Thursday, March 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంట్రామా సెంటర్ల ఏర్పాట్లపై త్వరలో విధాన నిర్ణయం

ట్రామా సెంటర్ల ఏర్పాట్లపై త్వరలో విధాన నిర్ణయం

- Advertisement -

ఆస్పత్రులపై బేసిక్‌ ఎక్యూప్‌మెంట్‌పై దృష్టి : ప్రశ్నోత్తరాల్లో
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమా దాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి 35 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో ట్రామా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే విధాన నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని శాసనసభ ప్రశ్నోత్త రాల్లో కాంగ్రెస్‌ సభ్యులు గలినోళ్ల మధుసుధన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ సభ్యులు సంజరుకుమార్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి పైవిధంగా స్పందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల పడకల సామర్థ్యాన్ని బట్టి బేసిక్‌ ఎక్యూప్‌మెంట్‌ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని అనేక ఆస్పత్రుల్లో వీటిని కల్పించేం దుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బేసిక్‌ ఎక్యూప్‌మెంట్‌ సౌకర్యం ఉంటే ఆస్పత్రులు విజయవంతమవుతాయని తెలిపారు. డాక్టర్లు ఎంత ముఖ్యమో, టెక్నిషియన్లు, ఎక్యూప్‌మెంట్లు కూడా అంతే ముఖ్యమని చెప్పారు. పడకల సామర్థ్యాన్ని బట్టి నిధులు కేటాయిస్తామని సభకు వివరించారు.

మోడల్‌ స్కూల్స్‌ టీచర్లకు 010 పద్దు కింద వేతనాలపై చర్యలు : దామోదర
రాష్ట్రంలో 146 మోడల్‌ స్కూల్స్‌ ఉన్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో బీఆర్‌ఎస్‌ సభ్యులు తన్నీరు హరీశ్‌రావు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి తరుపున ఆయన సమాధానం చెప్పారు. వారికి 010 పద్దు కింద వేతనాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఇప్పటికే 42 మంది ఉపాధ్యాయులు చనిపోయారనీ, ఆ స్థానంలో వారి వారసులకు పోస్టులు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఇతర సౌకర్యాలను కూడా కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -