Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొమ్మాల జాతరలో రాజకీయ రంగు

కొమ్మాల జాతరలో రాజకీయ రంగు

- Advertisement -

నవతెలంగాణ – గీసుగొండ: కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర వేడుకల్లో ఆధ్యాత్మికోత్సాహంతో పాటు రాజకీయ సందడి కూడా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అనుచరులు భారీ ప్రభ బండిని ఏర్పాటు చేశారు. ఈ ప్రభను అల్లం బాలకిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించగా, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కొండా మురళీధర్ రావు మాట్లాడుతూ, “నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు  అయితే నాకు  పునర్జన్మనిచ్చింది గీసుకొండ మండలం. నా రాజకీయ ప్రస్థానం ఇక్కడినుంచే మొదలైంది” అని పేర్కొన్నారు. తన భార్య కొండా సురేఖను ఎంపీపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా తీర్చిదిద్దిన ఘనత గీసుకొండ ప్రజలదేనన్నారు. ఇకపై తన కుమార్తె కొండా సుష్మిత పటేల్‌ను ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా నిలబెట్టాలని సంకల్పం వ్యక్తం చేశారు. ప్రభ బండి నిర్వహణను అద్భుతంగా చేపట్టిన అల్లం బాలకిషోర్ రెడ్డిని. నా గుండెల్లో పెట్టి చూసుకుంటానని భరోసా ఇచ్చారు.

కొండా సుష్మిత పటేల్ మాట్లాడుతూ, గీసుకొండ నుంచే తమ కుటుంబ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, తన రాజకీయ ప్రయాణం కూడా ఇక్కడినుంచే మొదలవుతుందని తెలిపారు. ఇక్కడికి రావడం సొంతింటికి వచ్చిన అనుభూతి కలిగిస్తుందని చెప్పారు. గీసుకొండ ప్రజలు తమ కుటుంబాన్ని ఆదరించినట్లే తనను కూడా ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. పరకాల ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారంలో రెండు రోజులు వంచనగిరిలో అందుబాటులో ఉంటానని తెలిపారు.

ఇక బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభ బండిని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని కార్యకర్తల్లో ధైర్యం నింపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రైతులు పాడి పంటలతో అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు.

జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పిల్లా పాపలతో ఎడ్లబండ్లపై తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక భక్తి, రాజకీయ ఉత్సాహం కలగలిసి కొమ్మాల జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -