Saturday, April 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవు

అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవు

- Advertisement -

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అంతర్జాతీయ వేదికలపై రాజకీయ నాటకాలు తగవని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ‘ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ 2026’లో యూత్‌ కాంగ్రెస్‌ నిరసన తెలపడాన్ని అయన ఎక్స్‌ వేదికగా తప్పుపట్టారు. ”యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులు తమ అల్ప రాజకీయ నాటకాల కోసం అంతర్జాతీయ వేదికను ఎంచుకోవడం అత్యంత విచారకరం. ఇలాంటి సమావేశాలను నిరసనల కోసం ఉపయోగించడం వల్ల, ప్రపంచ దేశాల ముందు మన దేశం యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే, కానీ ఎక్కడ, ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేయడానికి సమయం, సందర్భం ఉంటాయి. ‘ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ 2026’ వంటి అంతర్జాతీయ సదస్సు దానికి వేదిక కాదు. స్వంత పార్టీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు ఈ నిరసన చేపట్టడం విచిత్రం” అని కేటీఆర్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -