ఒకరిపై మరొకరు అంతులేని, అరమరికలు లేని ప్రేమకు గుర్తుగా వాలంటైన్ డే జరుపుకుంటారు. యువతీ, యువకులు తమ మనసుకు దగ్గరైన వారికి ఈ సందర్భంగా తనలోని ప్రేమను వ్యక్తపరుస్తారు. రెండు మనసులు ఒక్కటై…కలకాలం సంతోషంగా ఉండటమే ప్రేమికులు రోజు. కానీ, కట్టుతప్పిన రాజకీయాల్లో వాలంటైన్ డేను శుభాకాంక్షలకు వాడుకుంటున్నారు. సిద్ధాంతాలు, రాద్ధాంతాలు వేరైనా పదవికాంక్షతో ఈ విషెస్ చెప్పుకోవడం వింతగా ఉన్నది. ఒకరి మనసు ఒకరికి తెలియకపోయినా, వ్యక్తులెవరో తెలియక పోయినా సరే, మనసులో ఎన్నికుట్రలు, కుతంత్రాలు దాగిఉన్న బయటకు మహానటన ప్రదర్శిస్తున్నారు! మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ఎంతోమంది వివిధ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ క్యాంపుల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కేక్‌లు కట్‌చేసుకుంటూ, ఫైవ్‌స్టార్ హోటల్స్‌లో ఉత్సవాలను జరుపుకుంటున్నారు. పదవి లేదా డబ్బు ఈ రెండింటిపై మక్కువతో ముఖ పరిచయాలు లేనివారు కూడా కలిసి ఇందులో పాల్గొంటున్నారు. అందుకే ఇది ‘పొలిటికల్ వాలంటైన్’గా మారింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కటై బీజేపీ ఓడించేందుకు ప్రయత్నించి నట్టు కేంద్రమంత్రి బండి సంజరుకుమార్ వారికి వాలం టైన్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ఇది అ సందర్భమని తెలిసినా, ఏదో ఒక విమర్శ చేయాలి గనుక ఈ విధంగా ఎద్దేవా చేసినట్టు ఉన్నారు. దీనికి ప్రతి విమర్శగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు సిద్ధాంతాలను గాలికొదిలేసి పాలకవర్గాలుగా మారుతు న్నందుకు ఆయన కూడా ఆ పార్టీల నేతలకు వాలంటైన్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం ఈనెల 16న ఉంటే, ఆరోజు కాకుండా 14న దారుసలాం డే పేరుతో ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించింది. దీన్నిబట్టి చూస్తే వాలంటైన్ డే అంటే ప్రేమకు చిహ్నం అనేది పోయి రాగద్వేషాలకు నిలయంగా మారినట్టు కనిపిస్తోంది!
– గుడిగ రఘు
‘పొలిటికల్’ వాలంటైన్ డే!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



