నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలో 116 మునిసిపాలిటీలు, ఏడు కార్పోరేషన్ల పరిధిలోని వార్డు, డివిజన్లకు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరిగింది. క్యూలైన్‌లో ఉన్న ఓటర్లు ఓటు హక్కు వేయనున్నారు. ఈ పోలింగ్‌లో మొత్తం 52,17,413 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓటర్లలో పురుషుల(25,49,750) కంటే మహిళలే(26,67,025) అధికంగా ఉన్నారు. ఇతరులు 638 మంది ఉన్నారు.
అయితే.. ఇప్పటికే 116 మునిసిపాలిటీల్లోని మొత్తం 2,582 వార్డులకు గానూ ఇప్పటికే 12 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. నారాయణపేట జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీలోని ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. ఇక ఈనెల 13న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి



