Tuesday, December 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపే మూడవ విడత జీపీ ఎన్నికల పోలింగ్

రేపే మూడవ విడత జీపీ ఎన్నికల పోలింగ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలో మొత్తం ఒకటి జుక్కల్ మేజర్ గ్రామపంచాయతీతో పాటు మొత్తం 30 గ్రామ పంచాయతీల, 270 వాడు సభ్యుల ఎన్నికలు మూడో విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు నిర్వహిస్తామని అనంతరం రెండు తర్వాత ఎన్నికల ఓట్ల లెక్కింపులు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలియజేసిందని జుక్కల్ మండల ఎన్నికల అధికారి తెలిపారు.

అదేవిధంగా బాన్సువాడ డివిజన్ పరిధిలో మొత్తం వార్డులు బాన్సువాడలో  222 , బిచ్కుంద 204 , బీర్కూర్ 114, డోంగ్లి 116, జుక్కల్ 270 , మద్నూర్ 194, నస్రులాబాద్164, పెద్దకొడప్ గల్ 198, ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డుల సంఖ్య 449, పోలింగ్ జరిగే వార్డుల సంఖ్య ఒక వెయ్యి ఇరవై, నో వ్యాల్యూడ్ 13, మొత్తం ఎన్నిక జరగబోయే వాడుల సంఖ్య2790 వార్డులు ఉన్నాయని అధికారికంగా తెలిపారు. డివిజన్ పరిధిలో 26 సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు, పోలింగ్ జరిగే జీపీలు 142, పోటీ చేసే అభ్యర్థుల సర్పంచ్ల సంఖ్య 462, ఉందని ఎన్నికల అధికారి పేర్కొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -