Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రశాంతగా పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు

ప్రశాంతగా పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
 గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా జరిగిన మొదటి విడత పోలింగ్‌లో పర్యావరణహితంగా అలంకరించిన గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. మొదటి విడత పోలింగ్ జరుగుతున్న  బొమ్మలరామారం మండలం ఫకీర్ గూడెం ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని, తుర్కపల్లి మండలం రుస్తాపురం, గ్రామం, రాజాపేట మండలం నర్సాపూర్ గ్రామం,ఆత్మకూరు మండలం సర్వేపల్లి, ఆలేరు మండలం శారాజీ పేటలో  పోలింగ్ సరళని, ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి మండలంలో హరిత పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు.  గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు విశేష ఉత్సాహంతో పాల్గొన్నారు.ఈ కేంద్రాల్లో పచ్చని మొక్కలు, పూల అలంకరణ,కొబ్బరి తోరణాలు, ప్లాస్టిక్‌రహిత సామగ్రి, పర్యావరణహిత అలంకరణతో ఓటర్లకు మైమరపించే అనుభూతిని కల్పించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్‌చైర్ సౌకర్యక ఏర్పాటు చేశారు. అనంతరం తుర్కపల్లి మండలం గంధ మల్ల గ్రామంలో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -