Tuesday, October 28, 2025
E-PAPER
Homeఖమ్మంఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు.. 

ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు.. 

- Advertisement -

ఎమ్మెల్యే పాయం నాయకత్వంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ..
నవతెలంగాణ – మణుగూరు
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల ,హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు సబ్ డివిజన్ లో ఘనంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. పినపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రజా భవనంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు అనంతరం ఏరియా వంద పడకల ఆసుపత్రిలో రోగులకు  పండ్లు పంపిణీ చేశారు. పినపాక శాసనసభ్యులు వెంకటేశ్వర్లు నాయకత్వంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీనీ పట్టణంలో నిర్వహించారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ అధ్యక్షులు పీరినాకి నవీన్ ,భువనగిరి సైదులు, శివాలయం కమిటీ అధ్యక్షులు కూచిపూడి బాబు, అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -