- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ రెవెన్యూ,గృహ నిర్మాణం,సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని మంగళవారం అశ్వారావుపేట నియోజకవర్గంలోని అయిదు మండలాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని తన అధికారిక క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు తుమ్మ రాంబాబు,జూపల్లి రమేష్,సుంకవల్లి వీరభద్రరావు ల నేతృత్వంలో బర్త్ డే కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు.

- Advertisement -



