Monday, November 17, 2025
E-PAPER
Homeజిల్లాలుపొన్న లింగయ్య మృతి.. పార్టీకి తీరనిలోటు

పొన్న లింగయ్య మృతి.. పార్టీకి తీరనిలోటు

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ – కట్టంగూర్
నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు పోరాడిన పొన్న లింగయ్య మృతి పార్టీకి తీరని లోటని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చెర్వు అన్నారం గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పోన్నలింగయ్య(85) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన భౌతికాయం పై ఎర్రజెండాకప్పి,పుష్పగుచ్చాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   లింగయ్య పార్టీకి చేసిన సేవలను గుర్తు చేశారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చిన జీవితం కడవరకు సీపీఐ(ఎం) కొరకు పనిచేశారని ఆయన గుర్తు చేశారు.

ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతగానో కృషి చేశారని ఆయన తెలిపారు. ప్రజా పోరాటాలు ఉద్యమాలు ఎక్కడ నిర్వహించిన చురుకుగా పాల్గొనేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, మండల కార్యదర్శి పెంజర్లసైదులు, పార్టీ మండల నాయకులు, చిలుముల హేమంతయ్య, ఇటుకల సురేందర్, జాల రమేష్, గడగోజు రవీంద్రాచారి, చిలుముల రామస్వామి, కక్కిరేణిరాస్వామి, పొన్నఅంజయ్య,ముస్కు రవీందర్, పోన్న శాంతి కుమార్, రెడ్డిమల్ల బిక్షం, గద్దపాటి సుధాకర్, గంట వెంకన్న, నంద్యాల రాంరెడ్డి, కృష్ణయ్య, గద్దపాటిదశరథ, మల్లేష్, బీరప్ప, నరసింహ, నగేష్ సత్యం, వెంకన్న ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -