నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య చెలరేగిన వివాదం సద్దుమణిగింది. అడ్లూరి లక్ష్మణ్‍కు మంత్రి పొన్నం క్షమాపణలు చెప్పారు. అడ్లూరి లక్ష్మణ్‍ను తాను ఏమి అనలేదని నేను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దానికి అడ్లూరి బాధపడితే వ్యక్తిగతంగా క్షమాపణలు కోరుతున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతి నేర్పలేదన్నారు. మంత్రి అడ్లూరికి, నాకు పార్టీ సంక్షేమం తప్ప మరో ఉద్దేశం లేదని అన్నారు. కాగా ఇరువురు మంత్రుల మధ్య వివాదం నేపథ్యంలో ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తన నివాసంలో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పొన్నం, అడ్లూరి ఇద్దరు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు మంత్రుల మధ్య టీపీసీసీ చీఫ్ సయోధ్య కుదిర్చారు. అనంతరం ఈ ముగ్గురు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
అడ్లూరి లక్ష్మణ్‌కు క్షమాపణలు చెప్పిన పొన్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES