పనిచేయని లిఫ్టు- ఇబ్బంది పడుతున్న సిబ్బంది, ప్రజలు
నవతెలంగాణ- అచ్చంపేట
అన్ని ప్రభుత్వ శాఖ కార్యాలయాలకు ఆదర్శంగా ఉండవలసిన జిల్లా కలెక్టర్ కార్యాలయం దానికి విరుద్ధంగా పరిసర ప్రాంతాలు పారిశుద్ధ్యం లోపించి కనిపిస్తున్నాయి. ఖాళీ వాటర్ బాటిల్స్, ఇతర ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు ఖాళీ ప్రదేశాలలో పడేస్తున్నారు. పూల మొక్కల పరిసరాలలు, గ్రౌండ్ ఫోర్ లో కార్మిక శాఖ కార్యాలయం ప్రజా పౌర సంబంధాల శాఖ కార్యాలయం పరిసరాలలో వెదురు చెట్ల పరిసరాలు కొన్ని రోజుల తరబడి శుభ్రం చేయకపోవడంతో చెత్త చెదారంతో నిండిపోయాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయి.దుర్వాసన వెదజల్లుతున్నాయి.
వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాలు మూడోవ అంతస్తుల లలో నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా జిల్లా లోని 20 మండలాల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు ప్రజావాణి కి ఫిర్యాదు చేయడానికి వస్తున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో కలెక్టర్ కార్యాలయ పరిసరాలు ఇలాగేనా… ఉండేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. లిఫ్టు పని చేయకపోవడంతో రెండు, మూడవ అంతస్తు లోకి పోవడానికి కార్యాలయం సిబ్బంది, ప్రజలు అవస్థలు పడుతున్నారు. కలెక్టర్ కార్యాలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధించిన అధికారులు స్పందించి కలెక్టర్ కార్యాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా, లిఫ్ట్ పని చేసే విదంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.



