Sunday, July 6, 2025
E-PAPER
Homeఖమ్మంపెద్ద చదువులకు అర్హత సాధించిన పేద విద్యార్థులు…

పెద్ద చదువులకు అర్హత సాధించిన పేద విద్యార్థులు…

- Advertisement -
  • – బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందిన ప్రభుత్వం పాఠశాలల బాలికలు
    – సర్వత్రా వ్యక్తం అవుతున్న హర్షం
    నవతెలంగాణ – అశ్వారావుపేట
  • నేడు పెద్ద చదువులు గా భావించే సాంకేతిక సమాచారం విద్యను అందించే విశ్వవిద్యాలయం లో ఉన్నత విద్యను చదివేందుకు అశ్వారావుపేట పేద విద్యార్ధులు కొందరు ఎంపికయ్యారు. ఆర్జీయూకేటీ – ట్రిపుల్ ఐటీ(రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్) తెలంగాణ, నిర్మల్ జిల్లాలోని బాసర రాష్ట్ర విశ్వవిద్యాలయం శుక్రవారం ప్రకటించిన అర్హులు జాబితాలో మండలానికి చెందిన  పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు కు చోటు దక్కింది.
  • అశ్వారావుపేట మండలం లోని నాలుగు జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యను అభ్యసించిన పదో తరగతిలో ఉత్తీర్ణత పొందిన పది మంది బాలికలు అక్కడ సీట్ లు  సాధించారు.అధునాతన సాంకేతిక సమాచారం విద్యను బోధించే అత్యంత ప్రాముఖ్యత గల ఈ  విశ్వవిద్యాలయం లో వివిధ సాంకేతిక కార్యక్రమాలలో అండర్ గ్రాడ్యుయేట్,పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీల ను అందించే ఈ కళాశాలలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్ధినులు ఎంపిక అవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

తెలంగాణలోని ప్రతిభావంతులైన గ్రామీణ యువత విద్యా అవసరాలను తీర్చడం ఈ విశ్వవిద్యాలయం ఆశయం. విద్యతో పాటు, ఈ సంస్థ అదనపు విద్యా కార్యకలాపాలను విద్యలో తప్పనిసరి భాగంగా బోధిస్తుంది.కళలు, గాత్రసంగీతం,కూచిపూడి నృత్యం, యోగా వంటి వివిధ అదనపు విద్యా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. భారత దేశంలోని శాస్త్రీయ కళారూపాలను పాఠ్యాంశాల్లో చేర్చాలనే చొరవను రూపొందించారు. అంతః ప్రజ్ఞ, ప్రతి సంవత్సరం జాతీయ స్థాయి సాంకేతిక – సాంస్కృతిక ఉత్సవాన్ని ఈ కళాశాలలో నిర్వహిస్తారు.

ఇంత విశిష్ట విశ్వవిద్యాలయంలో అశ్వారావుపేట బాలికలు అడుగిడుతున్నారు. అశ్వారావుపేట బాలురు పాఠశాలలో చదివిన శాంతి, శైలజ, ఊహా, అఖిల, కీర్తి శ్రీ, విజయ లక్ష్మిలు, అశ్వారావుపేట బాలికల పాఠశాలలో చదివిన కే.శ్రావణి, షేక్ యాస్మిన్ లు, మామిళ్ళవారిగూడెం పాఠశాల విద్యార్ధిని ఏ.రవళి, గుమ్మడి వల్లి పాఠశాల విద్యార్ధిని డి.చందన లు బాసరలో సీట్ లు సాధించారు. బాసర ట్రిపుల్ ఐటీ లో సీట్ సాధించిన విద్యార్ధులు మొత్తం బాలికలే కావడం, అందరు రోజువారీ వ్యవసాయ కూలీ, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులే కావడం గమనార్హం. ఈ విద్యార్ధులను ఎంఈఓ ప్రసాదరావు,ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పి.హరిత, ఎన్.కొండలరావు, తాళ్ళపాటి వీరేశ్వరరావు, ఉపాద్యాయులు నరసింహారావు, కిశోర్ బాబు లు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -