Monday, November 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హమాలి కూలి రేట్లు పెంచాలి 

హమాలి కూలి రేట్లు పెంచాలి 

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
హమాలి కూలి రేట్ల పెంపు కొరకు సోమవారం శ్రద్ధానంద్ గంజిలో పనిచేస్తున్న తెలంగాణ ప్రగతిశీల కూరగాయ హమాలి, మిల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కూరగాయల హోల్సేల్ మార్కెట్లో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు కూలి రేట్లు పెంచమని డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గత కూలి రేట్ల పెంపు జరిగి మూడు సంవత్సరాలు దాటిపోయింది. ప్రతి సంవత్సరం నిత్యవసర ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి గతంలో ఉన్న కూలి రేట్లు హమాలి కార్మికులకు సరిపోతలేవు. అందుకే కూలి రేట్లు పెంచాలని, అదేవిధంగా సమాజంలో రోజురోజు పెరుగుతున్న నిత్యవసర ఇతర ఖర్చుల భారం కార్మిక వర్గంపై పడుతుంది. కావున కూలి రేట్లు పెంపుకై చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టియు నగర అధ్యక్షులు మల్లికార్జున్ శివకుమార్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రాజు మోహన్ యజమానులు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజు శంకర్ దావూద్ మథిన్ పీరయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -