Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గవర్నర్ , మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం

గవర్నర్ , మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం

- Advertisement -

నవతెలంగాణ -తాడ్వాయి :
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామ ప్రజలు, మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ లచ్చు పటేల్ ఆధ్వర్యంలో శుక్రవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. గ్రామాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని అభివృద్ధి పథకంలో ఆదివాసుల ప్రపంచంలోనీ అభివృద్ధి ఫలాలు అందుకోవాలనే కృషి సంకల్పంతో 45 ఇండ్లు, వ్యవసాయానికి 7 బోర్లు మహిళలకు స్వయం ఉపాధి కొరకు కుట్టు మిషన్లు, మిర్చి పౌడర్ తయారీ మిషన్లు తదితర అభివృద్ధి పనులు చేపడుతున్న సందర్భంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో వారు మాట్లాడుతూ మంత్రి సూచన, సలహాల మేరకు గవర్నర్ కొండపర్తి అడవి గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో అటవీ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చైతన్యం వెల్లువిరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇర్ప సీతారాములు, కల్తీ రమేశ్, ఇర్ప రామయ్య, గ్రామ ప్రజలు, మహిళలు, యూత్ నాయకులు తదితరు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -