ఎంపీ చామల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని చేర్యాల, తిరుమలగిరి మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ ఓడిపోవటంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ రెండు మున్సిపాల్టీల్లోని నాయకులు, కార్యకర్తలకు మధ్య గ్యాప్ నెలకొందని తెలిపారు. కోవర్టులు సైతం తయారయ్యారని పేర్కొన్నారు. ఆ రెండు మున్సిపాల్టీల కో-ఆర్డినేటర్లతో మాట్లాడి రిపోర్టు తెప్పించుకుంటామని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి ఆ నివేదికపై సమీక్షిస్తామని వివరించారు. అనంతరం పార్టీ ఓటమికి కారణమైన నాయకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆ మున్సిపాల్టీలపై పోస్టుమార్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



