Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోస్ట్ ఆఫీస్ ప్యాకర్ పాషా కన్నుమూత 

పోస్ట్ ఆఫీస్ ప్యాకర్ పాషా కన్నుమూత 

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట 
మండలంలోని పసర పోస్ట్ ఆఫీస్ లో ప్యాకర్ గా పనిచేస్తున్న ఎండి సాధిక్ పాషా అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన సాదికి పాషా గత 35 సంవత్సరాల పైబడి పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు. పసర గ్రామంలో నివాసం ఉంటూ మండలంలోని ప్రతి ఒక్కరికి పాషా సుపరిచితులు. పాషా మరణ వార్త విని అభిమానులు మిత్రులు ప్రజలు విస్మయం చెందారు. 

నిన్న మొన్నటి వరకు తమతో కలిపి పనిచేస్తూ కళ్ళముందే కనిపించిన పాషా ఒక్కసారిగా చనిపోయారు అన్న వార్తను స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. ప్రతి రంజాన్ పండుగకు తన సోదరులత కలిసి ఎంతోమందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు. ఈ రంజాన్ పండుగకు పాష లేరన్న వాస్తవాన్ని నమ్మలేకపోతున్నామని ప్రజలు అశ్రునయనాలతో తెలిపారు. బుధవారం పసర గ్రామంలో పాష అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -