నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండల పరిధిలోని గుండ్రత్ పల్లి యందు చనిపోయిన గోపు లక్ష్మయ్య మంతెన శకుంతల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున చెక్కును అందచేశారు. గుండ్రాత్ పల్లి పోస్ట్ ఆఫీస్ నందు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం క్రింద 436 చొప్పున కట్టినందుకు వీరు అనారోగ్యంతో చనిపోయిన నందుకు కేంద్ర ప్రభుత్వం స్కీం కింద రెండు లక్షల చెక్కును అందచేశారు. సంవత్సరానికి ఈ స్కీము వర్తిస్తుంది. భారత దేశంలో ఈ తపాల శాఖలోనైనా ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ప్రీమియం చెల్లించిన వ్యక్తులు కనీసం ఈ డబ్బులు కడితే అనారోగ్యంతో చనిపోయిన యాక్సిడెంట్ అయిన కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. గ్రామీణ ప్రాంతవాసులు కచ్చితంగా ఈ స్కీము వినియోగించుకొని కుటుంబానికి ధీమాగా ఉండాలని పెద్దపల్లి పోస్టల్ బ్యాంకు మేనేజర్ తృప్తి రాజేష్ వివరించారు. ఈ ప్రాంత వాసులకి ఈ స్కీం పట్ల అవగాహన కలిగించాలని పోస్టల్ సిబ్బందికి సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుండ్రాజ్పల్లి బ్రాంచ్ పోస్టుమాస్టర్ శేషు, అన్నారం విలాసాగర్ సండ్రవల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పాల్గొన్నారు.



