Saturday, February 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
ఎన్నికల విధులలో ఉన్న అధికారుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల  సందర్భంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు శనివారం ఒక ప్రకటన లో తెలిపారు.

జిల్లా లో ఫిబ్రవరి, 8,9 వ తేది లలో  మున్సిపాలిటీ పరిధిలో గలభువనగిరి,యాదగిరిగుట్ట,ఆలేరు, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీ లలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని, ఓటర్లుగా ఉండి ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు  ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ సౌకర్య (ఫెసిలిటేషన్) కేంద్రాలకు హాజరై తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తమ ఎన్నికల విధి ఆర్డర్, ఓటర్ ఐడి కార్డు మరియు ఫారం-12 (పోస్టల్ బ్యాలెట్ కోసం )తో సంబంధిత సౌకర్య కేంద్రానికి వెళ్లి అక్కడే పోస్టల్ బ్యాలెట్లు జారీ చేస్తారు.అధికారులు సౌకర్య కేంద్రంలోనే వెంటనే ఓటు వేసి, సంతకం చేసిన  పోస్టల్ బ్యాలెట్‌ను అదే రోజు అదే కేంద్రంలో సమర్పించవలసిందిగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -