ప్రజలకు అందుబాట్లో తపాలా సేవలు
సబ్ డివిజనల్ పోస్టల్ అధికారి సయ్యద్ అజారుద్దీన్
నవతెలంగాణ – కాటారం
గ్రామీణ అటవీ ప్రాంతాలకు విస్తరిస్తున్న తపాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సబ్ డివిజనల్ పోస్టల్ అధికారి సయ్యద్ అజరుద్దీన్ పేర్కొన్నారు. శనివారం కాటారం సబ్ పోస్ట్ కార్యాలయంలో తపాలా ఉద్యోగులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఫిబ్రవరి1 జరిగే పోస్టల్ ఇన్సూరెన్స్ డే ను విజయవంతం చేయాలని కోరారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మలహర్, కాటారం, మహాదేవపూర్, పలివెల, మహా ముత్తారం మండలాల్లో ఉద్యోగులకు తపాల శాఖ అందిస్తున్న బీమా పథకాలను విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని తెలిపారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులతో పోటీగా తపాల శాఖ బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో ఉద్యోగులు గడపగడపకు వెళ్లి ప్రజలకు వివిధ స్కీముల పట్ల అవగాహన కల్పించాలని కోరారు. వ్యవసాయ కూలీలు పేద ప్రజలు పోస్టల్ ఇన్సూరెన్స్ వినియోగించుకొని ధీమాగా ఉండాలని అన్నారు. పోస్టల్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు చాలామంది లబ్ధి పొందారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ పోస్ట్మాస్టర్ ములకల్ల మధుకర్, పోస్ట్మాస్టర్లు పాల్గొన్నారు.



