Tuesday, February 10, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పోస్టల్ సేవలను విస్తృతం చేయాలి..

పోస్టల్ సేవలను విస్తృతం చేయాలి..

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్
పోస్టల్ బ్యాంకింగ్ సేవలను గిరిజన గ్రామాల్లో విస్తృతం చేసి గిరిజనులు సద్వినియోగం చేసుకునేలా పోస్టల్ సిబ్బంది పని చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తపాలా సూపరింటెం డెంట్ బోరెడ్డి గుంపస్వామి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని తపాలా కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోస్టాఫీసు లోని పాలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో సిబ్బంది ఇంటింటికి వెవెళ్లి పోస్టల్ శాఖలో ఉన్న పొదుపు ఖాతాలపై అవగాహన కల్పించాలన్నారు.

ప్రజలంతా నిత్యం అందుబాటులో ఉండే పోస్టాఫీసులను వినియోగించుకొని పోస్టల్ సేవలు పొందేలా పని చేయాలని సూచించారు. ఎస్బీ, ఆర్డి, సుకన్య సంవృద్ధి, ఆర్పిఎస్ఐఐ, పీఎస్ఐ, బీమా, ఐపిపిబి వంటి పథకాలపై అవగాహన కల్పించాన్నరు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలనంటే ఖాతాలకు ఎన్పీసీఎల్ లింక్ చేసుకునేలా సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్వే మునీర్, స్టెనో వెంకటేష్, బీపీఎం భాగ్య శ్రీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -