తపాలా కార్యాలయాన్ని ప్రారంభించినఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో బుధవారం తపాలా కార్యాలయాన్ని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తపాలా కార్యాలయం ఎంతో ప్రయోజనకరమని,పింఛన్లు,గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసినటువంటి రూపాయలు మీ గ్రామంలోని తీసుకోవచ్చని తెలిపారు. గ్రామంలోని ప్రజలందరూ తపాలా కార్యాలయంలో ఖాతాను తీసుకోవాలని, డబ్బులను నీ ఖాతాలో జమ చేసుకోవచ్చు వెల్లడించారు. అవసరమైనప్పుడు ఆ డబ్బులను తీసుకోవచ్చు, ఆడపిల్లలపై సుకన్య యోజన పథకంపై డబ్బులను చెల్లించి వారి విద్యాభ్యాసానికి ఉపయోగపడతాయని అన్నారు.
డబ్బులను ఫిక్స్ డిపాజిట్ గా కూడా చేసుకోవచ్చని, బిపిఎం తపాలా కార్యాలయంలో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సూపర్డెంట్ జనార్దన్ రెడ్డి తపాలా కార్యాలయం సిబ్బంది, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు నారాయణరావు, శ్రీహరి, మారుతి, మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
తపాలా సేవలను సద్వినియోగం చేసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



