Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ 

లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ 

- Advertisement -

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని వెంకటాపురంలో గల శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నవంబర్ 1నుంచి 5 వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్, కరపత్రం ను స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నీ ఆయన నివాసంలో ఆలయ అధికారులు గురువారం కలిసి ఎమ్మెల్యే చేతులమీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మెన్ కొమ్మారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, ఆలయ కార్యనిర్వాహణ అధికారి మోహన బాబు, ధర్మకర్తలు, ఆలయ పండితులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -