Saturday, October 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్7న జల్సే సిరాతుల్ నబీ మశిరా పోస్టర్ ఆవిష్కరణ

7న జల్సే సిరాతుల్ నబీ మశిరా పోస్టర్ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
భీంగల్ పట్టణ కేంద్రంలోని జామితే ఉల్మా భీంగల్ బాబాపూర్, వారి కమిటీ ఆధ్వర్యంలో జల్సా సిరాతున్ నబి సళ్ళల్లహు అలిహి వేసళ్ళం ఇస్లాహ్ నాత్యయ మశిరా పోస్టర్ ను మతగురులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మూఫ్టీ షౌకత్ బేగ్ సహాబ్, మాట్లాడుతూ.. ఈనెల 7 మంగళవారం రోజున రాత్రి 8 గంటలకు నిర్వహించే జల్సా సిరాతున్ నబి సళ్ళల్లహు అలిహి వేసళ్ళం ఇస్లాహ్ నాత్యయ మశిరా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి మూఫ్టీ తారీక్ జమీల్ కాస్మి అలాగే నిజామాబాద్ జిల్లా నుండి మౌలానా సమీఉల్లా, జనాబ్ అశ్వక్ అసఫీ, ఈ కార్యక్రమాన్ని భీమ్‌గల్ మండల మత గురువుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమానికి వేల్పూర్, కమ్మర్ పల్లి, మోర్తాడ్, సిరికొండ, వివిధ మండలాల గ్రామాల నుండి ముస్లిం యువత పేద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదర్సా కమిటీ అధ్యక్షుడు హాఫిజ్ ఫహీం, అంజుమన్ కమిటీ అధ్యక్షుడు అంజుమ్ అలీ, హాఫిజ్ సహాబ్, హాఫిజ్ జలాల్, హాఫిజ్ సిరాజ్ సహాబ్, ఆఫీస్ రియాజ్, మౌలానా తౌఫిక్ సహాబ్, మోసిన్, మౌసన్ మూసా, హసీబ్ ఖురేషి, అమీర్, రిపోర్టర్ సయ్యద్ అత్తరుద్దీన్, రాఫై, నవాబ్, అదనాన్, రహీం, నేహాల్, మండలంలోని వివిధ మసీదుల మత గురువులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -