నవతెలంగాణ – మల్హర్ రావు
బహుజన రాజ్యాధికార ప్రదాత,భారత సామాజిక శాస్త్రవేత్త,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీఎస్పీ వ్యవస్థాపకు లు,మాన్యశ్రీ కాన్షీరాం 19వ వర్ధంతి పోస్టర్ ఆదివారం బిఎస్పీ నాయకులు ఆవిష్కరించ్చినట్లుగా బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు నర్ల గోపాల్ యాదవ్,ప్రధాన కార్యదర్శి బాపు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 9న పెద్దపల్లి జిల్లా కార్యాలయంలో వర్థంతి నిర్వహించడం జరుగుతుందన్నారు.
బిఎస్పీని ఏర్పాటు చేసి బహుజనులను రాజకీయ చైతన్యం చేసి రాజకీయ అధికారంవైపు నడిపి ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీని అధికారంలోకి తెచ్చినట్లుగా తెలిపారు. అట్టడుగు వర్గాల మహిళ కుమారి మాయావతి ముఖ్యమంత్రిని చేసి బహుజన వర్గాలకు భూ పంపిణీతోపాటు, విద్య ఉద్యోగ రంగాలలో అవకాశాలను కల్పించి అన్నిరంగలలో సామాజికన్యాయం చేసారని భారత రాజకీయ యుద్ధభూమిలో ఓట్లు మావి సీట్లుమీవా అనే నినాదంతో రాజకీయ అణచివేతగురైన బిసి అత్యంత వెనుకబడిన వర్గాలను చట్టసభలకుపంపి అధికారగౌరవాన్ని కల్పించి మనువాదుల గుండెల్లో వణుకు పుట్టించి బహుజనుల ఆత్మగౌరన్నీ చాటిచెప్పిన మహనీయుడు మాన్యశ్రీ కాన్షీరాం గుర్తుచేశారు.
అగ్రకుల మనువాద పార్టీలు బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా మోసం చేస్తే మండల్ కమిషన్ అమలు చేయించడంలో కాన్షిరామ్ పోరాటపటిమ రాజకీయవ్యూహం వల్లనే నేడు బిసిలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయన్నారు.బహుజనులకోసం జీవితాన్ని త్యాగం చేసి రాజకీయ పోరాటం చేసిన మాన్యశ్రీ కాన్షీరాం వర్థంతి కార్యక్రమాన్ని పార్టీ నాయకులు,కార్యకర్తలు, బహుజనులందరు తప్పక హాజరు కావాలని కోరారు.ఈకార్యక్రమం లో జిల్లా మాజీ అధ్యక్షుడు గొట్టే రాజు,పెద్దపల్లి అసెంబ్లీ అధ్యక్షుడు బొంకురి దుర్గయ్య,ప్రధాన కార్యదర్శి సాతురి అనిల్,సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు బోయిని రంజిత్,ఓదెల మండల అధ్యక్షుడు పల్లె ప్రశాంత్,సుల్తానాబాద్ పట్టణ అధ్యక్షుడు మాతంగి శంకర్ పాల్గొన్నారు.