నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు ఖాళీగా వున్న 8 అధ్యాపక పోస్టులు మంజురైనట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల లో 200 కు పైగా విద్యార్థుల సంఖ్య ఉండడం తో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల ముధోల్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుల తో కలిసి ఉన్నత విద్యామండలి చైర్మన్ బాల కృష్ణా రెడ్డి ని కలిశారు. అలాగే విద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రాలను అందించారు. దీంతో అధికారులు సానుకూలంగా స్పందించి 8 అధ్యాపక పోస్టులు మంజూరైనట్లు తమకు సమాచారం అందిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కళాశాల అధ్యాపకులు కలిసి ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పోస్టులు మంజూరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES