- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని పోతంగల్ కలాన్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు భావన,అన్వేష్ రాష్ట్ర స్థాయి యు/17 బాల బాలికల విభాగం లో రగ్బీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫీజికల్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రగ్బీ పోటీలలో కాట్రోత్ అన్వేష్ మంచి ప్రతిభ చాటి జిల్లా నుండి బాలుర కెప్టెన్ గా వ్యవరిస్తున్నారు అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగారావు తెలిపారు. వీరు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1వరకు మహబూబాబాద్ జిల్లా లోని డోర్నకల్ డిడి హై స్కూల్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని అని తెలిపారు. విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.
- Advertisement -



