నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హస కొత్తూర్ గ్రామంలో పలు చోట్ల పైపులైన్ లీకేజీల మరమ్మత్తుల కోసం తీసిన గుంతలను బుధవారం పూడ్చారు. గ్రామంలో పైప్ లైన్ల లీకేజీలపై ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం వాటిని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.పైపులైన్ లీకేజీలకు తక్షణమే మరమ్మత్తులు చేయించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఎంపీడీవో ఆదేశాల మేరకు గ్రామంలో పలుచోట్ల ఏర్పడ్డ పైప్ లైన్ లీకేజీలను సరి చేసి బ్లేడ్ ట్రాక్టర్, జేసీబీ సహాయంతో గుంతలను పూడిపించినట్లు పంచాయతీ కార్యదర్శి నవీన్ గౌడ్ తెలిపారు.
అదేవిధంగా గ్రామంలో ప్రస్తుత వేసవి కాలంలో ప్రజలకు నీటి కష్టలు రాకుండా ముందు జాగ్రత్తగా గ్రామంలో పలుచోట్ల ఏర్పడిన పెద్ద లీకేజీలను గుర్తించి, వాటిని సిబ్బందితో సరి చేయించినట్లు కార్యదర్శి నవీన్ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, వార్డ్ సభ్యులు పెద్ది సృజన్, కుందేటి శ్రీనివాస్, కనక నర్సయ్య, మాండపల్లి మహేందర్, దాశా రాజేశ్వర్, వాటర్ మ్యాన్ లు రాజన్న, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.



