- Advertisement -
నవతెలంగాణ – మునిపల్లి
మండలంలోని కంకోలు నుండి కప్పాడు వరకు గల ఆర్ అండ్ బి రోడ్డు గుంతలమయంగా మారింది. మేళాసంఘం పత్తి మిల్లుల నుంచి వచ్చే నీటి కారణంగా గుంతలు ఏర్పడ్డాయి. వెంటనే గుంతలను పూడ్చివేయాలని, రోడ్డు ఇరు ప్రక్కల ముళ్లపొదలను తొలగించాలని ఆర్ అండ్ బి అధికారి రవీందర్ సూచించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి హరినందన్ రావుతో కలిసి గురువారం ఆయన పత్తి మిల్లు యాజమాన్యంతో మాట్లాడి త్వరలో గుంతలను పూడ్చివేయాలని ఆదేశించారు. మేళాసంఘం గ్రామ పంచాయతీ కార్యదర్శి వాణి తదితరులు ఆయన వెంట ఉన్నారు.
- Advertisement -



