సీపీఐ(ఎం) రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు: యండి జహంగీర్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లా వ్యాప్తంగా వర్షాలకు పెద్ద ఎత్తున గ్రామాలలో, ప్రధాన జాతీయ రహదారులైన రోడ్ల పైన గుంతలు ఏర్పడి ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకునే నాధుడే లేడని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి. జహంగీర్ ఆవేదన వెలిబుచ్చారు. నిద్రావస్థలో ఆర్.అండ్.బి, పంచాయతీరాజ్ శాఖలు ఉన్నాయని ఆరోపించారు. ఆదివారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలోని జి.ఎన్.పి పంక్షన్ హాల్లో సీపీఐ(ఎం) భువనగిరి మండల స్థాయి పార్టీ సభ్యుల క్లాసులు నిర్వహించగా.. ఈ క్లాసుల బోధించడానికి ముఖ్యఅతిథిగా జహంగీర్ పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురవడం వల్ల రోడ్లు మొత్తం కూడా గుంతలు ఏర్పడి గుంతలలో నీళ్లు నిలిచి దారి కనబడక అనేకమంది వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు. ఈ గుంతలను పూడ్చడంలో ఈ రెండు శాఖలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.
తట్టెడు మట్టి కూడా గుంతలలో పోసే పరిస్థితి లేదని హైవే రోడ్ల వెంబడి కాజివేలు ఉండడం వల్ల వర్షాలకు రోడ్లపై నీళ్లు పోవడంతో రాకపోకలు ఇబ్బందులు జరుగుచున్నాయని చాలామంది ప్రయాణికులు తెలియక నీళ్లు దాటడం వల్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వము హై లెవెల్ బ్రిడ్జిని లను నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న రోడ్ల విషయంలో నోరు మెదపడం లేదని, మరమ్మతులు చేపట్టడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వము తగిన నిధులు కేటాయించి ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని లేకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు కొనసాగిస్తామని జహంగీర్ హెచ్చరించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ మాట్లాడుతూ.. అనాజిపురం నుంచి జంపల్లి వరకు డబల్ రోడ్డు నిర్మాణం చేయాలని, చిన్నేరు వాగు పైన, నాగిరెడ్డిపల్లి నందనం హైవే పైన హై లెవెల్ బ్రిడ్జినిలను నిర్మాణం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
క్లాసుల ప్రారంభానికి ముందు పార్టీ జెండాను సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు గునుగుంట్ల శ్రీనివాస్ ఆవిష్కరించగా ఈ క్లాసులకు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య ప్రిన్సిపల్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండ అశోక్, అన్నంపట్ల కృష్ణ , మండల కమిటీ సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేష్, బొల్లెపల్లి లీలా, సిలివెరు ఎల్లయ్య, పాండాల మైసయ్య,మోటె ఎల్లయ్య, కొండపురం యాదగిరి, మద్యపురం బాల్ నర్సింహ, కళ్లెం లక్ష్మీనరసయ్య, మండల నాయకులు వడ్డబోయిన వెంకటేష్, జటా అంజిరెడ్డి, అనాజిపురం గ్రామ శాఖ కార్యదర్శులు ఏదునూరి వెంకటేశ్, కడారి కృష్ణ , సభ్యులు యండి జహంగీర్, ముచ్చపతి బాలయ్య, బీసు సతీష్, మైలారం శివ, ఆకుల బిక్షపతి, నారగోని బాలరాజు, నాగుల రాజు, బొల్లెపల్లి ప్రవీణ్,భాను, కళ్యాణి, గీత, మౌనిక, శ్రీలత, లలిత లు పాల్గొన్నారు.
రోడ్లపై గుంతలు.. పట్టించుకునే నాథుడే లేడు: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES