- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని ఎత్తిపోతల ప్రాజెక్టుల పంపు సెట్లకు తమతోపాటు TRANSCO పగటిపూట మాత్రమే కరెంట్ సరఫరా చేస్తుందని, రాత్రిపూట ఉండదని తెలంగాణ ఇంధన శాఖ.. రాష్ట్ర నీటిపారుదల శాఖకు తెలియజేసింది. నిధుల కొరత దృష్ట్యా ప్రాజెక్టులకు 24 గంటలపాటు కరెంట్ సరఫరా కాదని, ఇప్పటికే నీటిపారుదల విభాగంపై రూ. 33,653 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయంది. ఆర్థిక భారం దృష్ట్యా బకాయిల్లో తక్షణమే రూ.500 కోట్లను చెల్లించాలని డిమాండ్ చేసింది.
- Advertisement -



