Monday, July 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.! 

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.! 

- Advertisement -

మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి
నవతెలంగాణ – మల్హర్ రావు:
అధికారం ఎవరికి శాశ్వతం కాదని, మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలని బిఆర్ఎస్ నాయకులు అన్నారు. సోమవారం మండలంలోని కొయ్యూరు ప్రెస్ క్లబ్ వేదికగా మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇటీవల జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే అధికారం శాశ్వతమనే భ్రమలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊహించుకుంటున్నారని తెలిపారు. రామగిరి ఎస్సై కమాన్ పూర్ మాజీ మార్కెట్ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ పైన వ్యవహరించిన శైలీ బాగాలేదని, కాంగ్రెస్ నాయకుల చెప్పు చేతల్లో అధికారుల నడవడిక ఉండకూడదని హెచ్చరించారు.

జవాజి తిరుపతి, శ్రావన్ లపై అక్రమ కేసులు బనాయించిన ఎక్కడ కూడా కోర్టులలో నిలవలేదనీ అధికారులు గుర్తుంచుకోవాలని తెలిపారు. బిఆర్ఎస్ పాలనలో చట్టానికి లోబడి పని చేశారని ఎక్కడ చట్టాన్ని అతిక్రమించలేదన్నారు. ఒకవేళ అధిక్రమిస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవారేనాని గుర్తు చేశారు.ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలల్లో కనీసం ఒకటైన పూర్తిగా చేశారాని ప్రశ్నించారు. రుణమాఫీ చేశామని చెప్పడం కాదు మండలంలో కనీసం 50 శాతమైన చేశారాని నిలదీశారు. అధికారులు అనేవాళ్ళు స్థానిక ప్రజలు కట్టే పన్నుల నుంచి జీతాలు తీసుకుంటున్నామని గుర్తించుకుని, ప్రతి ఒక్కరికి జవాబుదారీగా ఉండాలన్నారు. అనంతరం కొమురంబిం విగ్రహం వద్ద జూలూరి గౌరీ శంకర్ రచించిన, బహుజనగణమన, అనే పుస్తకాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ ఆదేశాల మేరకు  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళ నాయకురాళ్ళు, యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -