Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చెట్లపై పడిన విద్యుత్ వైర్లు

చెట్లపై పడిన విద్యుత్ వైర్లు

- Advertisement -

పట్టించుకోని విద్యుత్ శాఖ సిబ్బంది. .
నవతెలంగాణ – జుక్కల్ 

ఈదురు గాలులకు చెట్లపై విద్యుత్ వైర్లు తెగి పడుతున్నాయి. అటుగా వెళ్ళే వారు ఈ వైర్లను గమనించకపోతే ప్రాణహాని తప్పదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఈ వైర్లపై అవగాహన లేని చిన్నారులకు సైతం ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. ఈ విషయమై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ప్రజలు సమాచారం అందించినా పట్టించుకునే పాపాన పోవట్లేదని చెబుతున్నారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. నిత్యం గ్రామంలో ఏదో ఒకచోట విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని, సంబంధించిన అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోకపోవడంతో సమస్యలు పునరావృత్తం అవుతున్నాయే గానీ పరిష్కారం కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -