నవతెలంగాణ – అశ్వారావుపేట
సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులలో భాగంగా అశ్వారావుపేట పట్టణంలో శనివారం నుండి మంగళవారం వరకు ఉదయం 9 గంటలు నుండి సాయంత్రం 3 గంటలు వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ఏన్పీడీసీఎల్ ఆపరేషన్ విభాగం అశ్వారావుపేట సబ్ డివిజన్ ఏడీఈ వెంకటరత్నం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ పనుల్లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్థంబాలు పై 33 కేవీ,11 కేవీ,ఎల్టీ వైర్ లు అమర్చడం తో పాటు రోడ్ కు ఇరువైపులా ఉన్న పాత పోల్స్, వైర్ తొలగించడం జరుగుతుందని అన్నారు.
ఇందు నిమిత్తం వినాయకపురం రోడ్ (పోలీస్ స్టేషన్ నుండి పెద్ద రైస్ మిల్), ఓల్డ్ ఆంధ్రాబ్యాంక్ వీధి, దండాబత్తుల బజార్,గాంధీ బొమ్మ సెంటర్,ముస్లిం బజార్,దూదేకుల బజార్, చిన్నంశెట్టి బజార్,తూర్పు బజార్,వడ్డెర బజార్, అంబేద్కర్ నగర్, గౌడ బజార్, తిరుమల నగర్, శివయ్య గారి బజార్,గుర్రాల చెరువు రోడ్, రామాలయం బజార్, కోనేరు బజార్, పేట మాలపల్లి ఏరియాల్లో ఉదయం 9 గం నుండి మధ్యాహ్నం 3 గం వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.



