- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: త్వరలో ప్రారంభం కానున్న కాళేశ్వరములోని సరస్వతి పుష్కరాల దృష్ట్యా ప్రత్యామ్నాయ సరఫరా కొరకు మండలంలోని వళ్లెంకుంట, తాడిచెర్ల 33కెవి లైన్ మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఇందుకు వినియోగదారులు సహకరించాలని ఈ సందర్బంగా కోరారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ.. కాటారం మండలంలోని ధన్వాడ, గంగారం, దామెరకుంట సబ్ స్టేషన్లు, కొయ్యుర్ పరిధిలోని రుద్రారం, పెద్దతూండ్ల, మల్లారం సబ్ స్టేషన్లలో విద్యుత్ అంతరాయం వుంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
- Advertisement -